![]() |
![]() |
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రుద్రకి గంగ వేరే నెంబర్ నుండి స్వీటీలాగా ఫోన్ చేస్తుంది. రుద్రకి స్వీటి ఫోన్ చేసి సాయం కావాలని అడుగుతుంది. ఇక కాసేపు సోది పెడుతు రుద్రని విసిగిస్తుంది. మరోవైపు రుద్ర ప్రేమించిన పారు ఒంటరిగా కుర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళ అన్న ఒక వరుడి ఫోటోని తీసుకొచ్చి.. నువ్వు ఒప్పుకుంటే ఇతనితో నీ ఎంగేజ్ మెంట్ అని అంటాడు. దానికి పారు ఒప్పుకోదు. అతను కాబోయే కిక్ బాక్సింగ్ చాంపియన్. అతని కోసం స్పాన్సర్స్ క్యూలో నిల్చుంటున్నారని పారుతో వాళ్ళ అన్నయ్య చెప్పగానే.. కాబోయే ఛాంపియన్ నాకు వద్దు.. సక్సెస్ అయినవాడే కావాలి.. ఆ రుద్రని మించిన కిక్ బాక్సర్ లేడు.. కానీ అతడి దురదృష్టం ఒక్క రోజులో పతనం చేసింది. నాకు సమాజంలో గుర్తింపు, పేరు ఉన్నవాడే కావాలని పారు అనగానే అలాగే చెల్లెమ్మ.. నువ్వు ఎలా అంటే అలానే అని అతను అంటాడు.
మరోవైపు గంగ స్వీటీలా రుద్రకి దగ్గరవ్వాలనుకుంటుంది. అందుకే తను ఆపదలో ఉన్నట్టు వంశీతో యాక్ట్ చేపిస్తుంది. రుద్రకి గంగ కాల్ చేసి నిజంగానే తను ఆపదలో ఉన్నట్టుగా.. వంశీ ఒక రౌడీలా గంగని బెదిరిస్తాడు. ఇక అది నిజమే అనుకున్న రుద్ర కంగారుగా ఆ లొకేషన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ నెంబర్ కాల్ చేయగానే స్వీటీలాగా ఓ నర్స్ డ్రెస్ వేసుకొని ఉంటుంది గంగ. ఇక గంగ దగ్గరకు రుద్ర వెళ్తాడు. ఇక ఏంటి ప్రాబ్లమ్ అని రుద్ర అడుగుతాడు. నేను ఒక చిన్న హాస్పటల్ లో నర్స్ ని.. చిన్న ఆశలతో బతుకుతున్నా.. కానీ అన్నీ చిన్నగా ఉన్నా, ప్రాబ్లమ్స్ మాత్రం పెద్దగా వచ్చాయంటూ గంగ చెప్తూంటే రుద్ర అలాగే వింటుంటాడు. రుద్రకి గంగ మరో కథ అల్లబోతుంది. తనకి దగ్గరవ్వడానికి స్వీటీలాగా వచ్చిన గంగని రుద్ర కనిపెడతాడా లేదా చూడాలి మరి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |